ఏవియేషన్ పై అవగాహన కార్యక్రమం…
Mbmtelugunews//కోదాడ,మార్చి 10(ప్రతినిధి మాతంగి సురేష్):పీఎం శ్రీ బాయ్స్ హై స్కూల్ కోదాడ యందు సోమవారం నాడు విద్యార్థులకు ఏవియేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కోదాడ పట్టణం శ్రీరంగాపురం కు చెందిన ఉయ్యాల ఖ్యాతి అమెరికాలో పైలట్ కోర్సు చదువుకొని అక్కడే స్థిరపడి ఏ వి యెషన్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇవ్వనున్నట్లు బాయ్స్ హై స్కూల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు. 17 సంవత్సరాలు వయసు కలిగిన విద్యార్థినీ విద్యార్థులు ఏవియెషన్ కోర్స్ నందు చేరవచ్చునని దానికి కావలసిన సమాచారం అవగాహన శిక్షణకు సంబంధించిన విషయాలను తెలియచెప్పినారు. మన ప్రాంత వాసి అమెరికాలో స్థిరపడి జన్మభూమి పట్ల మమకారంతో విద్యార్థులకు అవగాహన శిక్షణకు సంబంధించిన సమాచారాన్ని అందించడం పట్ల కోదాడ మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి. సలీం షరీఫ్ అభినందించి, శాలువాతో సన్మానించడం జరిగింది. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తమ అభిరుచి మేరకు ఏవియేషన్ కోర్సులో చేరవచ్చునని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వి మీనాక్షి,ఉపాధ్యాయులు,షేక్ కాజామియా,ఎం వీర బ్రహ్మచారి,కే రామకృష్ణ, ఎం. జానకి రామ్, ఎస్. బ్రహ్మానందం,కె వి శ్రీనివాస్,జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు చందా శ్రీనివాసు,షేక్ జాఫర్ విద్యార్థులు పాల్గొన్నారు.