పిల్లల తల్లిదండ్రులకు ఆటల పోటీలు
:పలువురిని ఆకట్టుకున్న ఆటల పోటీలు
:చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న పిల్లల తల్లిదండ్రులు
Mbmtelugunews//కోదాడ,మార్చి 13(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక 17వ వార్డు నయా నగర్ లో గల కిడ్జ్ పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలకు ముఖ్యఅతిథిగా మాజీ వార్డ్ కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు పాల్గొని డైస్ వేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒడిదుడుకులు నిత్యజీవితంలో వంటగదికే పరిమితమైన తల్లిదండ్రులకు ఆటల పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు మనం ఒక నాడు చిన్న పిల్లలమే మేము మీలానే ఆడుకున్నాము ఇవి మా తీపి జ్ఞాపకాలు అని పిల్లలకు చెబుతూ ఆటలలో చక్కని ప్రతిభ కనబరిచారని అన్నారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని పిల్లల తల్లిదండ్రులు అభినందించారు. అనంతరం కౌన్సిలర్ ఆటలు ఆడి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం గులామ్ మంజూర్,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



