సాయిబాబా మందిరంలో పూజలు,అన్నదానం
Mbmtelugunews//కోదాడ,మార్చి 27(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో గల సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా పూజలు,అన్నదానం నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమానికి అనంతగిరి మాజీ సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వరరావు,పద్మావతి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.అల్సకాని శ్రీనివాసరావు,సుజాత,అన్వేష్ లు పులిహోర ప్రసాదానికి దాతలుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు,పూజారి సాయి శర్మ,పాలడుగు వెంకటేశ్వర్ రావు,బాలరాజు,అల్సకాని శరభేశ్వరరావు పాల్గొన్నారు.