తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా బొల్లు ప్రసాద్.
Mbmtelugunews//కోదాడ,మార్చి 28(ప్రతినిధి మాతంగి సురేష్):తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా తమ్మరకు చెందిన బొల్లు ప్రసాద్ నియామకమయ్యారు.ఈనెల 25, 26,27 తేదీలలో నిజామాబాద్ లో జరిగిన రాష్ట్ర మూడవ మహాసభలలో రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పాశ్య పద్మ,అధ్యక్షులు భాగం హేమంతరావులు బొల్లు ప్రసాద్ ను నియమించారు.జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా,తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రైతులు,కౌలు రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తాను చేసిన పోరాటానికి గుర్తించి తనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పాశ్య పద్మ,అధ్యక్షులు భాగం హేమంతరావులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బలు ప్రసాద్ మాట్లాడుతూ ఇకపై కూడా రాష్ట్ర రైతు సంఘం పిలుపుమేరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలు రైతుల రుణమాఫీ,రైతుబంధు,సబ్సిడీకి వ్యవసాయ పరికరాలు ప్రతి ఒక్కటి నెరవేర్చే వరకు నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు.