లక్ష్మిపురం వాసి జ్యోతిర్మయి రాణి కి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 08(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మిపురం గ్రామానికి చెందిన కవ్వంపల్లి జ్యోతిర్మయి రాణి కి ఉస్మానియా విశ్వవిద్యాలయం గణితశాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం చేసింది.సర్టెన్ ఫిక్స్డ్ అండ్ కపుల్ద్ ఫిక్స్డ్ పాయింట్ థీరమ్స్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెట్రిక్ స్పేసెస్ విత్ అప్లికేషన్స్ అనే అంశంపై ప్రొఫెసర్ వి నాగరాజు పర్యవేక్షణలో థీసిస్ సమర్పించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసినట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.డాక్టర్ కవ్వంపల్లి జ్యోతిర్మయి రాణి ప్రస్తుతం నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.డాక్టరేట్ సాధించడం పట్ల కోదాడ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.