గుర్తు తెలియని వాహనం ఢీకొని గేదెకు గాయాలు
:3800117152300 చెవిపోగు గల గేదె
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 25(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ పట్టణం బైపాస్ రోడ్డు గుడిబండ ఫ్లై ఓవర్ ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టాడడం తో తీవ్రంగా గాయపడి తొంటి తొలగి లేవలేని స్థితి లో ఉన్న గేదెను దారిన వెళ్తూ గమనించిన కట్టకొమ్ముగూడెంనకు చెందిన గొట్టుముక్కల శివ అతని మిత్రులు గమనించి స్వంత ఖర్చులతో స్థానిక ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకురాగా అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య వైద్యం అందించారు.చెవిపోగు ఆధారంగా భారత్ పశుదాన్ యాప్ లో వెతకగా గేదె బొజ్జగూడెం గ్రామనివాసి బి నాగేశ్వరరావు గేదె గా గుర్తించి వారికి ఫోన్ చేయగా వారు చాలా రోజుల క్రితమే గేదెను అమ్మినట్లు చెప్పినారు.

అది ఎవరు కొన్నారో తెలియదు అని చెప్పడం తో గేదె చికిత్స అనంతరం,గేదె సంరక్షణార్థం యజమాని ఆచూకి తెలిసేంతవరకు,శివ ఇంటికే గేదెను పంపించడం జరిగింది.ఇట్టి గేదెను గుర్తించిన వారు ఎవరైనా దాని యజమాని వివరాలు తెలిస్తే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో లేదా గేదె సంరక్షకులు శివ నెంబర్ 9505516328 కి సంప్రదించవలసినదిగా కోరనైనది.