ఆగిపోయిన ఆర్టీసీ బస్సు
Mbmtelugunews//హుజూర్ నగర్,ఏప్రిల్ 26 (ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి):కోదాడ నుండి నక్కగూడెం పోయే బస్సులు ఫిట్నెస్ లేని కారణం వల్ల ఇంజన్లో సౌండ్ వచ్చి బస్సు ఆగిపోయిన సంఘటన చింతలపాలెం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.గత వారం రోజుల కిందనే ఒక బస్సుకు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి కాలవలో పడిపోయింది,ఆ బస్సులో ప్రయాణికులు గాయాలు నుండి సరిగ్గా కోలుకోక ముందే ఈ బస్సు ఆగిపోయింది,ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహీస్తారు అని ప్రయాణికులు పోతున్నారు.కోదాడ డిపోలో కాలం చెల్లిన బస్సులే మేళ్లచెరువువైపు నడుపుతున్నారు అని ప్రయాణికులు అనుకుంటున్నారు.ఎక్కువ సర్వీసులు వేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనకు దారి తీస్తుంది అని ప్రయాణికులు అనుకుంటున్నారు.



