ఉచిత మజ్జిగ పంపిణీ వాసవి, విజయం క్లబ్ ఆధ్వర్యంలో
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 30(ప్రతినిధి మాతంగి సురేష్):అక్షయ తృతీయ సందర్భంగా కోదాడ పట్టణంలో గవర్నమెంట్ హాస్పటల్ లో బుధవారం ఉచిత మజ్జిగ పంపిణీ,పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి వాసవి క్లబ్ విజయం ప్రెసిడెంట్ పాల్గొని మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.వాసవి క్లబ్ సమాజంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజసేవే లక్ష్యంతో ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ కోదాడ పట్టణంలో అనేక రకాల చలివేంద్రం మజ్జిగ పంపిణీ సమాజ సేవ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు.వాసవి క్లబ్ రీజన్ 8 రీజన్ 9 సేవా కార్యక్రమంలో పోటీపడి సేవ చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ విజయం ప్రెసిడెంట్-జిల్లా జనార్దన్ రావు,సెక్రటరీ-సోమిశెట్టి సతీష్,కోశాధికారి-కనుముర్లపూడి శ్రీహరి,జెడ్సి -బోండా ప్రవీణ్,ఆర్సి -పైడిమర్రి సతీష్,ఐపిసి-పబ్బా గీత,ఆర్ఎస్-బండారి శ్రీనివాస్,డిపిఓ-ఇమ్మడి సతీష్,డిస్టిక్ ఇంచార్జ్-చల్లా లక్ష్మీ నరసయ్య,దేవరశెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు.