బాప్టిస్ట్ చర్చిలో వేసవి బైబిల్ తరగతులను ప్రారంభం
Mbmtelugunews//కోదాడ,మే 06(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో ఆరు రోజుల వేసవి బైబిల్ తరగతులను యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఇట్టి తరుగతులను పిల్లలకు వేసవి విడుపుగాను,ఆధ్యాత్మిక విషయాల్లో బోధిస్తూ ఆటలు పాటలతో ఉల్లాసంగా గడపటానికి ఎంతో దోహదపడతాయని పిల్లలు శారరకంగా,ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి అని ఆయన అన్నారు.వారు ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రత్యేక తరగతులకు ప్రత్యేకంగా టీచర్లను ఏర్పాటు చేశారు.ఈ ప్రత్యేక తరగతులకు శ్యాంబాబు,కోటయ్య,జగ్గు నాయక్,సుధా,స్టీఫెన్, శీభాషాలనిలు విద్యార్థులకు కావలసిన భోజనాది కార్యాలను ఏర్పాటు చేసి పిల్లలను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ క్రిస్టియన్ సభ్యురాలు వంటెపాక జానకి ఏసయ్య.మాజీ చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు,ఏనోసు,రమ్యశ్రీ,పావని,సరిత,ప్రజ్వలిత,మల్లిక విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.