అంకిత భావంతో పనిచేసే ఉద్యోగికి సమాజంలో గుర్తింపు
:సమాజానికి మనమేమిస్తామని నినాదంతో ఏర్పడిందే ఆస్క్: లక్ష్మీనారాయణ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,మే 09(ప్రతినిధి మాతంగి సురేష్):ప్రభుత్వ ఉద్యోగి తన వృత్తిలో అంకిత భావంతో పని చేస్తే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, డిసిసిబి మాజీ అధ్యక్షులు ముత్తవరపు పాండురంగారావు, విశ్రాంతి ఉద్యోగుల రాష్ట్ర నాయకులు రావేళ్ళ సీతారామయ్యలు అన్నాడు.అంబేద్కర్ ఆశయసాధన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు బల్గూరి దుర్గయ్య ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య లు ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణలో మాతంగి ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ బార అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,డిసిసిబి మాజీ అధ్యక్షులు ముత్తవరపు పాండురంగారావు,రావిళ్ళ సీతారామయ్య,మండల సహకార కళాశాలల విద్యాసంస్థల
చైర్మన్ పందిరి నాగిరెడ్డి,విశ్రాంతి ఉద్యోగుల జిల్లా నాయకులు బొల్లు రాంబాబులు పాల్గొని
మాట్లాడుతూ మాతంగి ప్రభాకర్ రావు తన వృత్తికి వన్నెతెచ్చారని కొనియాడారు.తను పనిచేసిన పాఠశాలలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు.అలాగే అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం కుఎనలేని కృషిచేసి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషి చేశారని కొనియాడారు ప్రభాకర్ రావు ముందు ముందు ఎన్నో సమాజసేవలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని శేష జీవితాన్ని గడపాలని తెలిపారు.ఈ కార్యక్రమములో మాజీ వార్డ్ కౌన్సిలర్లు సామినేని నరేష్,కర్రీ శివ సుబ్బారావు,బొల్లు ప్రసాదు,ఆస్క్ సభ్యులు,అస్క్ ఉపాధ్యాయులు,విద్యార్థులు,బంధుమిత్రులు,కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు



