ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం……..
Mbmtelugunews//హుజూర్ నగర్,మే 09(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుకున్న 1997-1998 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 27 సంవత్సరాల తర్వాత పాఠశాల పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఆనాటి తీపి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులు అంతా కలిసి ఘనంగా సన్మానించారు.ఆనాటి ఉపాధ్యాయులు ఎంవైఎస్ చార్యులు,జగన్నాథం,సత్తయ్య,పిడతల వెంకటేశ్వర్లు,సుధాకర్,బోధనేతర సిబ్బంది విజయనిర్మల,రాములు,విజయలక్ష్మీ లను పూర్వ విద్యార్ధులు ఘనంగా సన్మానించారు.అనంతరం ఆట పాటలతో చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.



