మన దేశ త్రివిధ దళాల క్షేమం కొరకు కోదాడ బాప్టిస్ట్ చిన్నారుల ప్రత్యేక ప్రార్థనలు.
:చిన్నారుల ప్రత్యేక ప్రార్థనలు దేశ ప్రగతికి మెట్లు -చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,మే 09 (ప్రతినిది మాతంగి సురేష్):చిన్నారులు చిన్ననాటి నుండే ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వలన వారు పెద్దయినాక ఉన్నతమైన స్థానంలో ఉంటారని టీపీసీసీ డెలిగేట్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు.బాప్టిస్ట్ చర్చి లో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో దేశం కోసం,దేశ సైనికుల కోసం వారి క్షేమం కొరకు చిన్నారులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు.గత 5 రోజుగా జరుగుతున్న బైబిల్ వేసవి తరగుతులు ఘనంగాకూడా జరిగినాయి.

ఈ ఐదు రోజులు పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నారు.సామాజిక విషయాలు ఆరోగ్య సూత్రాలు రోడ్డు భద్రత విషయాల పై అవగాహన కల్పించారు.పిల్లలకు మంచి విషయాలు నేర్పించారని లక్ష్మీనారాయణ రెడ్డి టీచర్లను ప్రశంసించారు.అనంతరం చిన్నారులకు బహుమతులు ప్రధాన వసం చేశారు.ఈ కార్యక్రమం సినియర్ కాంగ్రెస్ నాయకులు వంటిపులి వెంకటేష్,గుండెపోంగు రమేష్,టీచర్లు ద్రాక్షవల్లి,తబిత,రాణి,సుధా,పావని,ప్రజ్వలిత,నాన్సీ,రమ్య,జీవని,లిన్సీ,రాంబాబు,ఎనోచ్ తదితరులు పాల్గొన్నారు