కాగిత రామచంద్రపురం వాసి అలుగుపల్లి మౌనిక రెడ్డి కి డాక్టరేట్
Mbmtelugunews//కోదాడ, మే 16(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం గ్రామానికి చెందిన అలుగుపల్లి మౌనిక రెడ్డికి చైతన్య డిముడ్ యూనివర్సిటీ డెవలప్మెంట్ మరియు క్యారెక్టర్రైజేషన్ ఆఫ్ సాలిడ్ లిపిడ్ నానో పార్టికల్స్ ఎ మోడ్రన్ ఫార్ములేషన్ అప్రోచ్ ఇన్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనే అంశంపై ప్రొఫెసర్ ల పర్యవేక్షణలో థీసిస్ సమర్పించినందుకు చైతన్య డిముడ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ పరిశోధన వలన ఎక్కువ డ్రగ్ రిలీజ్ చేసే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేలా పేషెంట్ కి లాభం చేకూరే విధంగా రఘు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు లాభం చేకూరే విధంగా పరిశోధన చేశారు.డాక్టరేట్ సాధించడం పట్ల నడిగూడెం మండల పరిధికి చెందిన పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.ఈ కార్యక్రమంలో రిజిస్టార్ రవీందర్ డీన్ శంకరయ్య గైడ్ డేనియల్ ఆర్అండ్డి డీన్ క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.