ఉత్తమ్ పద్మావతి యువసేన ఆధ్వర్యంలో క్రీడాకారులకు భోజన ఏర్పాట్లు.
:యువత చదువుతోపాటు క్రీడలో రాణించాలి.
:వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ .
Mbmtelugunews//కోదాడ,జూన్06(ప్రతినిది మాతంగి సురేష్):చదువుతోపాటు యువకులు కూడా క్రీడల్లో రాణించాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు.నడిగూడెం మండల కేంద్రంలో స్థానిక బాలుర పాఠశాలలో 40 రోజుల నుండి వేసవి కాల క్రీడా శిక్షణ తరగతులు ముగిశాయి.ఈ సందర్భంగా క్రీడాకారులకు ఉత్తమ్ పద్మావతి యువసేన తరపున మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేశారు.అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని క్రీడల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు.ఓటమి ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని చిన్నతనం నుండి గెలుపు ఓటములను స్వీకరించి జీవితంలో సవాలులను స్వీకరించి క్రమశిక్షణతో మంచి స్థాయిలోకి రావాలన్నారు.యువత మద్యపానం,ధూమపానం,గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంతోమంది క్రీడాకారులు శిక్షణ ఇస్తూ క్రీడాకారులు క్రీడల్లో ఉద్యోగాలు ఉపాధి రంగాలలో రాణించటానికి కృషి చేస్తున్న పల్లపు నాగేశ్వరావును అభినందించి ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు మీరాజుద్దీన్,ఇంతియాజ్,శ్రీధర్,యువకులు శ్రీకాంత్,కరుణాకర్,హరీష్,సాయి,వెంకటేష్,వంశీ,సమాద్,సాయి,మహేష్,మధు,షకీల్ తదితరులు ఉన్నారు