బజరంగ్దళ్ పేరుతో మా పొట్ట కొడుతూ మా పైన కేసులు పెడుతున్నారు
:వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ను కలిసి వినతి పత్రం అందజేసిన గంగిరెద్దుల వ్యాపారస్తులు.
Mbmtelugunews//కోదాడ,జూన్ 13(ప్రతినిది మాతంగి సురేష్):ఏళ్ల తరబడి తాత తండ్రుల నుండి జీవనోపాధిగా కొనసాగిస్తున్న పశువుల క్రయవిక్రయాల వ్యాపారాలను యధావిధిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని గంగిరెద్దు వ్యాపారస్తులు శుక్రవారం చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ సుధీర్ ను వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూదురా ప్రాంతాల నుండి ఖమ్మం మిర్యాలగూడ సూర్యాపేట ఆంధ్ర నుండి లక్షల రూపాయలు పెట్టి పశువులను కొనుగోలు చేసి వస్తున్న సమయంలో దారి కాచి బజరంగ్దళ్ బిజెపి నాయకులం అంటూ వాహనాలు ఆపి బెదిరింపులకు గురి చేస్తూ రసీదులు ఉన్నప్పటికీ ఏదో ఒక కారణం చూపించి పోలీసులకు సమాచారం ఇచ్చి అక్రమంగా కేసులు పెట్టించి పశువులను గోశాలకు తరలిస్తున్నారని మా జీవనోపాధి మీద పొట్ట కొడుతున్నారని వారు చైర్ పర్సన్ వద్ద వాపోయారు.కొంతమంది రాత్రి వేళలో రోడ్డుకు అడ్డంగా వాహనాలు ఆపి డబ్బులు ఇస్తారా లేక కేసులు పెట్టించమంటారా అంటూ దాడులకు ప్రయత్నిస్తున్నారని ఇలా అయితే వ్యాపారాలు లేక ఇతర పనులు చేయలేక వందల కుటుంబాలు రోడ్డున పడతాయని వారు చైర్ పర్సన్ కి విన్నవించారు.సమస్యలను వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బషీర్,మెంబర్లు వీరబాబు,వెంకటరెడ్డి,వెంకటేశ్వర్లు,సూర్యం,గంగిరెద్దు వ్యాపారస్తులు తదితరులు ఉన్నారు.