నూతన సిఐని కలిసిన డివిజన్ నాయకులు
Mbmtelugunews//కోదాడ,జూన్ 13(ప్రతినిధి మాతంగి సురేష్):వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ పరిధిలోని ఏనుమాముల పోలీస్ స్టేషన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ ను శుక్రవారం 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈసందర్భంగా స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కాంగ్రెస్ నాయకులను సిఐ కోరారు.సిఐని కలిసిన వారిలో ఎన్టీఆర్ నగర్,ఇందిరమ్మ కాలనీ,రెడ్డిపాలెం,ఎస్సార్ నగర్,బాలాజీ నగర్ శాఖల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల రాజేందర్,గొలుసుల సంతోష్,రామ్ రెడ్డి,మచ్చర్ల స్టాలిన్,కడెం కుమార్ సీనియర్ నాయకులు బండ్ల సురేందర్,పిట్ట నగేష్,పురాణం రవి,మోటం సురేష్,ల్యాగల బిక్షపతి,ఉబిది సారంగం,గంధం సారంగపాణి,అధ్యక్షుడు కస్తూరి భారత్,అఖిల్,పిట్ట సుధీర్, తదితరులు పాల్గొన్నారు.