Friday, July 4, 2025
[t4b-ticker]

కేసుల పరిష్కారానికి లోక్ దాలత్ చక్కని మార్గం.

కేసుల పరిష్కారానికి లోక్ దాలత్ చక్కని మార్గం.

Mbmtelugunews//కోదాడ,జూన్ 14(ప్రతినిది మాతంగి సురేష్):దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు.శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.లోక్ అదాలత్ తో కక్షిదారులకు డబ్బు,సమయం ఆదా అవుతాయి అన్నారు.రాజీ మార్గమే రాజ మార్గమని కక్షలు,పట్టింపులకు పోయి కక్షి దారులు నష్ట పోవద్దని సూచించారు.ఈ సందర్భంగా సివిల్,క్రిమినల్ కేసులతోపాటు రాజీ పడదగిన అన్ని కేసులు పరిష్కారం చేసారు.కోదాడలోని అన్ని కోర్టులలో క్రిమినల్ కేసులు 354,సివిల్ కేసులు 5,నేరం ఒప్పుకున్న కేసులు 45,బ్యాంక్ కేసులు 65 ద్వారా 56లక్షలు రూపాయలు జరిమాన ద్వారా 1లక్ష 90వేల రూపాయలు,ఎస్టిసి కేసులు 764 ద్వారా 25వేల రూపాయలు వసూలు అయినట్లు తెలిపారు.ఇలా వివిధ రకాల కేసులు మొత్తం1233 కేసులు ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య,సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ,ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య,బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కోడూరు వెంకటేశ్వరరావు,యడ్లపల్లి వెంకటేశ్వర్లు,హుస్సేన్,కానుగు మురళి,ఏపీపీ సిలివేరు వెంకటేశ్వర్లు,లోక్ అదాలత్ సభ్యులు అర్వపల్లి పవన్ కుమార్,ఆవుల మల్లికార్జున రావు,సామ నవీన్ కుమార్,గంధం కోదండపాణి,న్యాయవాదులు తమ్మినేని హనుమంత రావు,గట్ల నరసింహారావు,ఈదుల కృష్ణయ్య,ఎంవీఎస్ శాస్ట్రీ,దావీదు,బెల్లంకొండ గోవర్ధన్,శ్రీదేవి,షేక్ రహీం,హేమలత,మంద వెంకటేశ్వర్లు,రియాజ్,పాషా,నాగుల్ మీరా,వివిధ బ్యాంక్ ల మేనేజర్లు,పోలీస్ సిబ్బంది,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular