ఆర్యవైశ్య సేవా స్ఫూర్తి సమస్త లోకానికి ఆదర్శం
:ఆర్యవైశ్యులకు మంత్రి ఉత్తమ్ నేను ఎంతో రుణపడి ఉంటాం.
:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
Mbmtelugunews//కోదాడ,జూన్ 15 (ప్రతినిది మాతంగి సురేష్):ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. ఆదివారం స్థానిక గుడు గుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.గత 30 ఏళ్లుగా మంత్రి ఉత్తమ్ తోపాటు తనకు ఆర్యవైశ్య సంఘాలతో విడదీయని అనుబంధం ఉందని ఆత్మీయ భావాన్ని వ్యక్తం చేశారు.తమ ఇంటి ఆడబిడ్డగా తనను ఆదరిస్తున్నారన్నారు.ఆర్యవైశ్య సేవ స్ఫూర్తి సమస్త లోకానికి ఆదర్శమని కొనియాడారు.ఆర్యవైశ్యుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు.ఏ సమస్య ఉన్న తనను నేరుగా కలవవచ్చున్నారు.ఆర్యవైశ్య భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.వాసవి మాత ఆశీర్వాదంతో అతి త్వరలో భవన నిర్మాణానికి పనులు ప్రారంభమవుతాయన్నారు.ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రంలోనే అత్యంత బలమైన సంఘం అన్నారు.సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం సామాజిక సేవ రంగంలో అగ్రస్థానంలో నిలిచి రాష్ట్రంలో పేరుగాంచాలని,నూతన కార్యవర్గానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఆర్యవైశ్య మహాసభ జిల్లా మహిళా విభాగం మరింత చైతన్యవంతంగా ఉండాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా మహాసభ పక్షాన ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కోదాడ వైశ్యులు రాజకీయ చైతన్యంలో అగ్రస్థానంలో ఉంటారని కొనియాడారు.రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం ద్వారా పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక సహకారం అందిస్తానన్నారు.ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు.అనంతరం నూతన అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమనర్సయ్య,కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ తో పాటు కార్య వర్గానికి రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ,మహిళా విభాగంలో ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమామహేశ్వరి,ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి,కోశాధికారిగా వెంకటలక్ష్మి తోపాటు కార్యవర్గాన్ని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద,జిల్లా రాజకీయ విభాగ చైర్మన్ కక్కిరిని శ్రీనివాస్,మీడియా విభాగ చైర్మన్ వంగవీటి శ్రీనివాసరావు,ఎన్నారై విభాగం చైర్మన్ ఇరుకుల చెన్నకేశవరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు లచే ఇరుకుల్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జిల్లా యువజన సంఘం అధ్యక్షులుగా బొమ్మిడి అశోక్,ప్రధాన కార్యదర్శిగా చల్ల అశోక్,కోశాధికారిగా స్వామి గణేష్ ,ఉపాధ్యక్షులుగా డాక్టర్ భరత్ చంద్ర,ఇమ్మడి అనంత చక్రవర్తి,భరత్,సాయి,ప్రవీణ్ లచే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరే లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం ముఖ్య అతిథులను,నూతన కార్యవర్గ సభ్యులను,ఆర్యవైశ్య పెద్దలను ఘనంగా సన్మానించారు.కాగా జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవానికి జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యులు తరలివచ్చారు.సభా ప్రాంగణం ఆర్యవైశ్య సోదరులతో మహిళలతో సందడిగా మారింది.జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు మా శెట్టి అనంత రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు,సంఘ నాయకులు అవోపా బాధ్యులు,వాసవి క్లబ్స్ బాధ్యులు,జిల్లా లోని వివిధ మండలాల,గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు…