మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు తగదు.
కోదాడ,జూన్ 15 (ప్రతినిధి మాతంగి సురేష్)నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని
ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ మలిదశ ఉద్యమం కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు,కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ అన్నారు.బనకచర్ల ప్రాజెక్టుపై మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్లుగా మంత్రి ఉత్తమ్ పై మాట్లాడడం సరికాదన్నారు.ఇదే విషయమై ఆదివారం హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు… తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు ఆద్యం పోసింది గత ప్రభుత్వంలోని మీ పార్టీ నాయకుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ కారకుడున్నారు.ఆయన చేసిన కుట్రలు కుతంత్రాలు చీకటి ఒప్పందాలతోనే తెలంగాణ సాగునీటి రంగానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఆరోపించినట్లుగా గుర్తు చేశారు.గత ప్రభుత్వంలో కేసీఆర్ భాయ్ భాయ్ అంటూ కృష్ణ నది జలవిషయంలో లోపాయి కారు ఒప్పందలతో తీవ్ర అన్యాయం చేశారంటూ… ఇదే విషయమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తే ఓర్వలేక ఆయనపై ఆరోపణలు అర్ధహితమైన మాటల దాడికి దిగుతున్నారని ఇది మీ స్థాయికి తగ్గట్టుగా లేదన్నారు.ఏపీ జలదోపిడికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంటే… రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పై విపక్ష పార్టీలైన బిజెపి,టిఆర్ఎస్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.తక్షణమే మీ వాక్యాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు…