పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు:కె.భవ్య, జూనియర్ సివిల్ జడ్జి.
Mbmtelugunews//కోదాడ, జూన్ 16(ప్రతినిది మాతంగి సురేష్):బడి ఈడూ పిల్లలు పనిలో ఉండకూడదని బడిలో ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కె భవ్య అన్నారు.సోమవారం ఉదయం కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బాలకార్మిక నిర్మూలన అనే అంశంపై నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాతూ
పిల్లల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చాయని అందులో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం ఒకటన్నారు.పిల్లలను పనిలో పెట్టుకుంటే యాజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని,పిల్లలను పనిలో పెట్టుకున్నవారికి లేబర్ అధికారులు జరిమానాలు విధిస్తారన్నారు.పిల్లలు ఏదైనా ప్రమాదంలో వుండే 1098 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలన్నారు.పిల్లలు సెల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలి,వాటికి బానిసలు కావద్దాన్నారు.తరగతి గదిలో పాఠాలు వింటూ,మీ సీనియర్స్ ను,మంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను చూసి,ఉపాద్యాయులు చెప్పే విషయాల ద్వారా ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని ఆమె కోరారు.పొక్సో చట్టం,బాలకార్మిక నిర్మూలన చట్టం,బాల్య వివాహాల నియంత్రణ చట్టం,విద్యా హక్కు చట్టం,బాలల హక్కుల రక్షణ చట్టాలు అనేకం ఉన్నాయని,మీరు చట్టపరిధిలో చట్టాలకు లోబడి నడుచుకుంటే భవిష్యత్ బాగుంటుందన్నారు.బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ లీగల్ అవేర్ నెస్ పోగ్రాం లో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సిహెచ్ సత్యనారాయణ,అడిషనల్ పిపి సిలివేరు వెంకటేశ్వర్లు,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శేషారత్నం,హైస్కూలు ఇంచార్జీ హెడ్ మాస్టర్ డి మార్కండేయులు, న్యాయవాదులు గట్ల నర్సింహారావు,హేమలత,మంద వెంకటేశ్వర్లు,సెగ్గెం వెంకటాచలం,దొడ్డ శ్రీధర్,మండల లీగల్ సర్వీస్ సిబ్బంది,పారా లీగల్ వాలంటీర్లు,ఉపాధ్యాయులు బడుగుల సైదులు,ఖాజామియా,ఎం బ్రహ్మం, విధ్యార్దులు తదితరులు పాల్గొన్నారు.