క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
Mbmtelugunews//కోదాడ,జూన్ 18(ప్రతినిది మాతంగి సురేష్):స్థానిక నయా నగర్ లో కోదాడ నియోజకవర్గం క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులుయేసయ్య ఆధ్వర్యంలోఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు జీవించు సంవత్సరములు అధికమవాలని ఆయుష్ ఆరోగ్యాలతో ఉన్నత పదవులు అలంకరించి కోదాడ పట్టణానికి ఇంకా అభివృద్ధి పదంలో నడిపించి ప్రజల మనలను పొందుకొని వర్ధిల్లాలని అన్నారు.వారి కొరకు పాస్టర్లు నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గుండెపంగు రమేష్,గంధం పాండు,క్రైస్తవ నాయకులు రాజేష్,ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.