మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జన్మదిన వేడుకలు
:కోదాడలో అంబరాలను అంటిన సంబరాలు.
:రోగులకు పండ్లు పంపిణీలు.
Mbmtelugunews//కోదాడ,జూన్ 20 (ప్రతినిది మాతంగి సురేష్)కోదాడ,హుజూర్ నగర్ ప్రజలే తమ కుటుంబంగా చూసుకుంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కోదాడలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎడమ కాలువ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కారింగుల అంజి గౌడ్ పాల్గొని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వేలకోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు చేయించి నియోజకవర్గన్నీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కందుల కోటేశ్వరరావు, రావెళ్ల కృష్ణారావు, విద్యాసాగర్, నలజాల శ్రీనివాసరావు, కొనతం శ్రీనివాసరెడ్డి, బాగ్దాద్, యాదగిరి, వంటిపుల్లి రమ శ్రీను, నెమ్మది దేవమని, రామారావు తదితరులు పాల్గొన్నారు.