అంధకారంలో ఖమ్మం రోడ్డు
:వెలగని సెంట్రల్ లైటింగ్
:లైటింగ్ లేకపోవడం వలన వాహనదారులకు ఇబ్బందిగా మారిన వైనం
:మున్సిపల్ పరిధిలోగల వీధులలో కూడా ఇదే పరిస్థితి.
:పట్టించుకోని మున్సిపల్ అధికారులు
Mbmtelugunews//కోదాడ,జూన్ 21 (ప్రతినిది మాతంగి సురేష్):కోదాడ మున్సిపల్ పరిధిలోని ఖమ్మం క్రాస్ రోడ్ నుండి పెద్దమోరి బ్రిడ్జి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసినదే.ఆ సెంటర్ లైటింగ్ ఎలగక నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని పలువురు వాహనదారులు పాదచరు లు వాపోతున్నారు.తెల్లవారుజామున మహిళలు వాకింగ్ కు వెళ్లాలంటే భయాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్లే పరిస్థితి నెలకొన్నది.అసలే కుక్కల బెడదతో భయపడుతున్న పాదచరు లు,వాకర్స్ కు ఈ సెంటర్ లైటింగ్ వెలగకపోవడంతో ఇంకా భయాందోళనలకు గురి అవుతున్నామని పలువురు వాపోతున్నారు.ఇవే కాకుండా కోదాడ మున్సిపరిధిలో చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి చోటు చేసుకున్నది.మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు.కొన్ని వీధులలో మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బంది రాత్రి సమయంలో లైట్లు వేయడం,వేసిన లైట్లను ఉదయాన బందు చేయడం మర్చిపోతున్నారని పలువురు వాపోతున్నారు.కోదాడ మున్సిపల్ పరిధిలో లైటింగ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని లైటింగ్ వ్యవస్థను సక్రమంగా పునరుద్ధరించాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.