అంజన్ సేన ఆధ్వర్యంలో.. ఘనంగా మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు
Mbmtelugunews//కోదాడ,జూన్ 20(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలో శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరా శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు అంజన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.దీనిలో భాగంగా అంజన్ సేన మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కారింగుల అంజన్ గౌడ్, పంది తిరుపతయ్య మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ సేవలు మరువలేనివని పేర్కొన్నారు.జిల్లావ్యాప్తంగా ప్రజాభిమానం చూరగొన్న నేతగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు.

వారి పుట్టిన రోజు ను జిల్లా వ్యాప్తంగా పండుగల అభిమానులు జరుపుకోవడమే అందుకు నిదర్శనమని వారు కొనియాడారు. అనంతరం మిఠాయిలు తినిపించి కార్యకర్తలకు స్వీట్లను పంచి పెట్టారు.
మంత్రి జన్మదిన వేడుకల్లో మాతంగి సురేష్, గుగులోతు సురేష్, పంది కళ్యాణ్, కుడుముల సైదులు, గుండు మధు, తంగేళ్లపల్లి లక్ష్మణ్, సోమపంగు శ్రీను, కాసర్ల సత్యరాజ్, చింత షాలేమ్, ఎల్ రవి కిరణ్, సోంపొంగు కిషోర్, కార్యకర్తలు పాల్గొన్నారు.