శారీరక,సామాజిక,మానసిక, ఆరోగ్యంకు యోగ అవసరం:నామా నరసింహారావు
Mbmtelugunews//కోదాడ,జూన్ 21(ప్రతినిది మాతంగి సురేష్):అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు, కేలో ఇండియా కోదాడ, సూర్యాపేట జిల్లా కబడ్డీ ట్రైనింగ్ సెంటర్ కోచ్ జాతీయ క్రీడాకారులు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామా నరసింహారావు ఆధ్వర్యంలో స్థానిక కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది మానసిక ప్రశాంతతకు జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు పోవుటకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక సాధనం అని దీనిని అన్ని రకాల వయసు గలవారు ప్రతిరోజు సాధన చేయొచ్చని తెలిపారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్, డయాబెటిక్స్, పెరాలసిస్ రకరకాల వ్యాధులు సక్రమిస్తున్న రోజుల్లో వాటన్నిటిని అరికట్టాలంటే యోగా ఒక ప్రత్యేకమైన సాధనం అని వారు అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు యోగా సాధన చేస్తే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదంటూ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు నవీన్, ఖాజా, సైదులు, రమేష్, తులసి నాయక్,తదితరులు పాల్గొన్నారు.



