కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.
Mbmtelugunews//కోదాడ,జూన్ 21(ప్రతినిది మాతంగి సురేష్):కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ యోగ గురువు గురూజీ ప్రతాప్ మహారాజ్ పాల్గొని యోగా ఆవశ్యకతను విద్యార్థులకు, విద్యార్థినులకు విపులంగా వివరించారు. ప్రతాప్ మహారాజ్ యోగా ఆవశ్యకతను వివరిస్తూ యోగా అంటే జీవితాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం అని, ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ యోగ అని, దేహాన్ని దేవాలయంగా, జీవుణ్ణి దేవుడిగా, జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, అలహాదంగా మలచుకోవడానికి మార్గాన్ని చూపించేది యోగా అని, మానవాళికి అందుబాటులో ఉన్న అతి పెద్ద భాగ్యం యోగా అని,
యోగా సంతోషాన్ని, సౌఖ్యాన్ని కూడా ఏక కాలం లో అందిస్తుందని, యోగా ఆసనాలు ఒత్తిడి నుండి దూరం చేస్తాయని, యోగా నిరంతర ప్రక్రియ అని, యోగాసనాల ద్వారా విద్యార్థులను ఉత్తేజపరిచారు.

కిట్స్ కళాశాల చైర్మన్
నీలా సత్యనారాయణ మాట్లాడు తూ విద్యార్థినులు యోగాను దిన చర్యగా పాటించాలని, యోగాతోనే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారని అన్నారు. ఈ యోగా కార్యక్రమం లో ప్రముఖ బ్రీతింగ్ కోచ్ నిపుణులు గెల్లా బద్రీనాధ్ పాల్గొని విద్యార్థినులకు బ్రీతింగ్ మెలుకువ లు నేర్పించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున రావు, ప్రోగ్రాం కన్వీనర్ ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, స్వర్ణ భారతి ట్రస్ట్ ఫౌండర్ గాదంశెట్టి
శ్రీనివాస్, రాజశేఖర్, విద్యార్థి నులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.