బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పిల్లలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి:బిజెపి రాష్ట్ర నాయకులు వికాస్ రెడ్డి
Mbmtelugunews//హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కు సంబంధించిన పాఠశాలల నిర్వహకులు గత రెండు సంవత్సరాల నుంచి పిల్లలకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బిజెపి రాష్ట్ర నాయకులు వికాస్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో పిల్లలకు చదువు చెప్పలేమని,పుస్తకాన్ని ఇవ్వలేమని, యూనిఫామ్స్ ఇవ్వలేమని, హాస్టల్ కల్పించలేమని, చెప్పటంతో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. రేక్కాడితే డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటూ ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడుతున్నటువంటి ఈతరణంలో పాఠశాలలో వారికి ఇవ్వాల్సినటువంటి మౌలిక వసతులను, సదుపాయాలు పాఠశాల యాజమాన్యం ఇవ్వలేమని చెప్పడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీం కింద జాయిన్ అయినా విద్యార్థులకు నోటు బుక్స్ డ్రస్సులు సంబంధిత సౌకర్యాలు కల్పించాలని అన్నారు.