విద్యుత్ హైఓల్టేజీతో భారీ నష్టం ఈదురుగాలులకు కలిసిపోయిన విద్యుత్ తీగలు
Mbmtelugunews//కోదాడ, జులై 08(ప్రతినిధి మాతంగి సురేష్): మంగళవారం సాయంత్రం కోదాడ పట్టణంలో గాలి దుమారానికి విద్యుత్ తీగలు కలిసిపోయి ఇంట్లోకి అధిక ఓల్టేజీ సరఫరా కావడంతో ఇంట్లో విద్యుత్ షాట్ సర్య్కూట్ జరిగి ఇంట్లో గృహోపకరణాలు మొత్తం కాలిపోయిన సంఘటన ఖమ్మం క్రాస్ రోడ్ లో జరిగింది. బాదితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో అల్లం థామస్ రెడ్డి నివాసముంటున్నాడు. సాయంత్రం ఐదు గంటలసమయంలో ఈదురు గాలులు వీచాఇ. ఈ సమయంలో విద్యుత్ లైన్స్ ఒకదానితో ఒకటి కలవడం థామన్ రెడ్డి ఇంట్లోకి హైఓల్టేజి సరఫరా అయ్యింది. ఇంట్లో ఉన్న ఎసీ, టీవి, ప్రిజ్తో పాటు ఇంట్లో వైరింగ్ మొత్తం కాలిపోయింది. మంటలు అంటుకోవడంతో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి మంటలను ఆర్పివేశారు. సుమారు ఐదు లక్షల రూపాయలనష్టం వాటిల్లినట్లు బాదితుడు తెలిపాడు. ఈ ప్రాంతంలో మరో నాలుగైదు ఇళ్లలో కూడ హై ఓల్టేజి వల్ల నష్టం జరిగనట్లు సమాచారం.



