కాకి పిల్లకి ప్రాణం పోసిన కోదాడ వాసి ఉపేందర్
:ప్రాంతీయ పశువైద్యశాలలో విరిగిన కాలుకి రాడ్ వేసి ఆపరేషన్ తో అతికించిన వైద్యులు.
Mbmtelugunews//కోదాడ, జులై 14(ప్రతినిది మాతంగి సురేష్): పట్టణం లోని ఒక ఇంటివద్ద గల చెట్టుపై కాకి గూడుకట్టుకుని 5 పిల్లలని పొదిగింది. నిన్న సాయంత్రం ఆ చెట్టుని కొట్టివేసే సమయంలో గూడు కిందపడి కాకి పిల్లలు నేలకు పడ్డ క్రమములో ఒక కాకి పిల్ల కాలు విరిగి బొక్కలు బైటకు వచ్చాయి. ఇంటి యజమాని పడిపోయిన పిల్లలను చేరదీసి పాలుపోసి కాలు విరిగిన పిల్లను వైద్యం కోసం నేడు స్థానిక పశువైద్యశాలకు తీసుకుని రాగా అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య విరిగిన కాలును పరీక్షించి ఆర్డోపెడిక్ ఆసుపత్రి లో వదిలివేసిన సన్నటి రాడ్స్ తెప్పించి మత్తు మందులు ఇచ్చి కాకి పిల్లకి నొప్పి తెలియకుండా శస్త్రచికిత్స ద్వారా విరిగిన ఎముకల్లో రాడ్ వేసి కాలును విజయవంతంగా అతికించడం జరిగింది. మన సంస్కృతి లో సామాజికంగా అత్యున్నత ప్రాధాన్యత కలిగినది కాకి అయినా మన ముఖ్య కార్యక్రమాల్లో అందరం అవసరం కోసం వాడుకునే వాళ్ళమే అయినా వాటికి ఆపద వస్తే మాత్రం కాకి కదా అని వదిలేసే స్వభావమున్న వారందరికీ భిన్నంగా కోదాడ వాసి ఉపేందర్ కి మాత్రం కాలు విరిగిన కాకి పిల్ల సైతం సృష్టిలో తనవలే ఒక ప్రాణమే అని భావించి తన స్వంత పనులను సైతం వదులుకొని విరిగిన కాలుకు వైద్యం చేయించి ప్రాణం పోసి రక్షించడం ఎంతో అభినందనీయం అని కొనియాడారు. చికిత్సాకార్యక్రమములో సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్, కర్ణ తదితరులు పాల్గొన్నారు.