పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిది: ఎంఈఓ
Mbmtelugunews//కోదాడ, జులై 14(ప్రతినిది మాతంగి సురేష్): ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిది అని కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీమ్ షరీఫ్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఆజాద్ నగర్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో దాతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్, మాజీ వార్డు కౌన్సిలర్ గుండెల సూర్యనారాయణ యాదవ్, దాత పిడతల శంకర్ పాల్గొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాలడుగు వరమ్మ మండల విద్యాధికారిని, దాతలను శాలువలతో పూల బోకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిదని అలాగే ప్రభుత్వం కల్పిస్తున కంప్యూటర్ విద్య, ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్నం భోజనం లాంటి అవకాశాలను కల్పిస్తున్నారని దీనిని విద్యార్థుల సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాల అధిరోహించాలని తెలిపారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వరమ్మ, మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు దాతల సహకారంతో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో ఎంఈఓ సహకారం ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదని తెలిపారు. దాతలు పిడతల శంకర్ దండాల శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు డైరీలు, బెల్ట్ లు ఐడి కార్డులు అందజేశారు. అలాగే మాజీ వార్డు కౌన్సిలర్ సూర్యనారాయణ పాఠశాలకు మైక్ సౌండ్ సిస్టంని, కుర్చీలు అందజేశారు. కోదాడ గ్రామానికి చెందిన పిడతల శ్రీను పాఠశాలకు టేబుల్ కుర్చీలు అందజేశారనందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ గంగాభవాని, ఎం స్వరూప, వి కవిత, బి సుజాత, కే పరంజ్యోతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.