ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలి
డివైఎఫ్ఐ
Mbmtelugunews//కోదాడ, జులై 25(ప్రతినిది మాతంగి సురేష్): ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే ఆసరా పెన్షన్లు వితంతు వృద్ధాప్య వికలాంగుల చేయూత గీత కార్మిక పెన్షన్ల కోసం గత మూడు నాలుగు సంవత్సరాల నుండి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని ఉన్నారు వాటిని వెంటనే మంజూరు చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నడిగూడెం ఎమ్మార్వో వి సరిత కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ మాట్లాడుతూ
తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వికలాంగుల పెన్షన్ 6000 వేల రూపాయలు
మొత్తం చేయూత పెన్షన్లు 4000వేలు పెంచుతామని హామీ ఇచ్చి 19 నెలలు గడిచిన పెన్షన్లు ఇంతవరకు మంజూరు చేయలేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుండి గత నాలుగు సంవత్సరాలు నుండి నూతన పెన్షన్లు మంజూరు చేయలేదు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వితంతు, వికలాంగులు, వృద్ధాప్య, గీత కార్మిక,ఒంటరి మహిళలు, బోదకాలు, కిడ్నీ బాధితులు తదితర పెన్షన్లు వెంటనే మంజూరు చేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. నిరుపేద లబ్ధిదారులు గత నాలుగు సంవత్సరాల నుండి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే నూతన పెన్షన్ మంజూరు చేయాలి లేని ప్రేక్షంలో డివైఎఫ్ఐ అన్ని ప్రజాసంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు జమ్మి ఎల్లయ్య నాయకులు గోలి సతీష్, అంతయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.



