కందగట్ల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను తనిఖీ చేసిన కేంద్ర బృందం
Mbmtelugunews//సూర్యాపేట, జులై 31(ప్రతినిది మాతంగి సురేష్): ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని స్థానిక కందగట్ల ఏ ఏ ఎం హాస్పిటల్ ను సెంటర్ బృందం తనిఖీ గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ రికార్డులను రోగుల వైద్య పరీక్షల ఫలితాలను ఆన్లైన్లో పరిశీలించారు సందర్భంగా సెంట్రల్ బృందం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్యాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అలాగే హాస్పిటల్ వైద్య సిబ్బంది రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మంచి వైద్యం అందించాలని తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో అందిస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు రోగులకి అందుతున్నాయా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యురాలు డాక్టర్ పర్వీస్ సుల్తానా, ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం అధికారి ఉమామహేశ్వరి, జిల్లా ఎస్ డి సూపర్వైజర్ సాంబశివరావు, వైద్యాధికారి వీరేంద్రనాథ్, కందగట్ల ఏఎన్ఎంలు సుజాత అరుణ, ఆశా వర్కర్లు సుజాత, విజయ, శారద తదితరులు పాల్గొన్నారు.



