ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ని కలిసిన కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్.
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 01 (ప్రతినిది మాతంగి సురేష్): స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని కలిసి, జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పిడమర్తి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. జర్నలిస్టుల యూనియన్ జిల్లా నాయకులు కారింగుల అంజన్న గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జర్నలిస్టుల సమస్యలను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా అంజన్న గౌడ్ మాట్లాడుతూ… గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొంతమంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేశారని, ఈ నేపథ్యంలో అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలుపుతూ సేవ చేస్తున్నటువంటి జర్నలిస్టులను ఆదుకోవాలని ఈ క్రమంలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను మంజూరు చేయాలని అలాగే ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ పడిశాల రఘు కుటుంబాన్ని సైతం ఆదుకోవాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మనవి చేశారు.ఈ కార్యక్రమంలో పూర్ణ చంద్రరావు, కే సైదులు,సురేష్, రాము,మరికంటి లక్ష్మణ్, వెంకన్న,టి నాగారజు, శ్రీకాంత్, గోపాల్, టి లక్ష్మణ్, నజీర్, శేఖర్, సంపత్, నాగరాజు, మదు తదితరులు పాల్గొన్నారు….



