కడుపుల గాయం తో బుడ్డడిగిన కోడికి శస్త్ర చికిత్స
Mbmtelugunews//కోదాడ ఆగస్టు 02(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పట్టణంలో పందెం జాతి కోళ్లను సాకే పెద్దోజు శశిధర్ ఇంట్లో ని ఒక కోడి గుడ్లు పెట్టకుండా పొట్ట భాగం లో గడ్డ లా తయారై ఉండడాన్ని గమనించి ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకువెళ్లగా కోడి ని పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య కడుపు కండరాలకు జరిగిన గాయం వల్ల లేదా కండరాల బలహీనతల వలన పొట్ట భాగాలు కండరాల నుండి బైటకు వచ్చి కండరాలకి చర్మం కింద నిలిచి బుద్ధ. దిగి బైటకు గడ్డలాగా తయారైందని అన్నారు. దానికి శస్త్రచికిత్స నిర్వహించి బైటకు వచ్చిన పొట్ట భాగాల్ని యధా స్థితికి చేర్చి కుట్లు వేయడం జరిగింది. ఆపరేషన్ తరువాత కోడి చలాకీగా తిరుగుతూ యజమానికి ఆనందం కలిగించింది. ఈ శస్త్ర చికిత్సలో సిబ్బంది చంద్రకళ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.



