ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ సాధించిన కొత్త గోల్ తండా గిరిజన వాసి -డాక్టర్. బానోత్ బాల సుబ్రమణ్యం.
Mbmtelugunews//కోదాడ ఆగస్టు 02 (ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామానికి చెందిన బానోతు కోట, లక్ష్మి (లేటు) వారికీ జన్మించిన డాక్టర్. బానోతు బాలసుబ్రహ్మణ్యం ,యూనివర్సిటీ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో “ఇంటర్ హార్మోనిక్ కరెంట్ కంపెన్సేషన్ యూజింగ్ బ్యాక్ స్టెప్పింగ్ కంట్రోల్ స్ట్రెటజీ ఫర్ గ్రిడ్ కనెక్టెడ్ డీజీ యూనిట్” టాపిక్ మీద పరిశోధన( రీసెర్చ్ ) చేయటం జరిగింది,సూపర్వైజర్ ప్రొఫెసర్ ఎం. బాలసుబ్బారెడ్డి, కో సూపర్వైజర్ జి మల్లేశం సహాయం తో పరిశోధన పూర్తి చేయటం జరిగింది. ఇంత మంచి యూనివర్సిటీ లో డాక్టరేట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందం గా ఉందని అదేవిధంగా పిహెచ్డీ అడ్మిషన్ తీసుకున్న రోజే అమ్మను(లక్ష్మి) కోల్పోయాను అని, మాది చాలా నిరుపేద కుటుంభం, అమ్మ కూలి పనులకు పోయి ఎంతో కష్ట పడి నా చదువుకు కావలిసిన బుక్స్ సమాకూర్చేది.గవర్నమెంట్ స్కూల్ నుండి పి హెచ్ డి వరకు ప్రోత్సహించినందుకు అమ్మ కి జీవితాతం రుణపడి ఉంటానని, ఈ గౌరవప్రదమైన డాక్టరేట్ ను అమ్మకే అంకితం చేస్తున్నాని, అదేవిధంగా ప్రొఫెసర్ మంగు నాయక్ వైస్ ప్రిన్సిపాల్, పరిశోధనలో సలహాలు, సూచనలు ఇచ్చినదుకు వారికీ, నా కుటుంభం తరుపున నాకు సపోర్ట్ గా ఉన్నా అక్క,బావ, దారవత్ సుశీల రామ, అన్న, వదిన,బానోవత్ రవి నాయక్ సుచిత్ర, అదేవిధంగా నాతో తోడుగా పరిశోధన సమయంలో సపోర్ట్ గా నిలిచినా నా భార్య బానోతు జ్యోతికి, పిల్లలు, అరుష్ నాయక్, రుద్రభవేష్ అందరికి పేరు పేరు నా నాయొక్క హృదయ పూర్యక నమస్కారాలు అని డాక్టర్ బానోతు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.



