ఫౌండేషన్ పేరుతో మోసాలు
:ప్రాంతాన్ని బట్టి కొత్త ఫౌండేషన్ ఏర్పాటు చేయడం.
:ఈ ఫౌండేషన్ ద్వారా మహిళలే టార్గెట్
:గతంలో కోదాడ ప్రాంతంలో 35 మందికి ఐపీ నోటీసులు దాఖలు చేసిన ఫౌండేషన్ సభ్యులు.
:గురుకులాలలో, కోర్టులలో, ప్రభుత్వ కార్యాలయాలలో జాబులు ఇస్తానంటూ టోకరా.
:ఈ ఫౌండేషన్ వారు మహిళలను లక్ష్యంగా చేసుకొని డబ్బులు దండుకుంటున్నారు.
Mbmtelugunews//సూర్యాపేట జిల్లా ఆగస్టు 08:ఫౌండేషన్ పేరుతో మోసాలు జరగడం అనేది ఒక పెద్ద సమస్య. చాలామంది ఫౌండేషన్స్ ఏర్పాటుచేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రజలను నమ్మబలికించి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మహిళలను వారి వైపు తిప్పుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు.ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.ఇలాంటి సంఘట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణానికి చెందిన ఓ మహిళ అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గతంలో ఓ సంస్థపేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసగించి ఐపీ పెట్టిన విషయం తెలిచిందే. అదే వ్యక్తులు మరల వారితో పాటు సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ పురుషుడు మహిళా కలిసి మరో సంస్థ పేరుతో మోసాలు చేస్తున్నట్లు ఓ బాధితుడు తన గోడును వెళ్ళబుచుకున్నారు.
*ఉద్యోగాల పేరుతో మోసం*:
కొన్ని ఫౌండేషన్స్ స్కూల్స్ లలో, కాలేజీల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి.
*సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో మోసం*
:కొన్ని ఫౌండేషన్స్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి, ప్రజల నుండి డబ్బులు సేకరించి, ఆ తర్వాత ఆ డబ్బులను దుర్వినియోగం చేస్తారు లేదా తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తారు.
*మోసాల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు*:
:ఫౌండేషన్ల గురించి పూర్తిగా తెలుసుకోవడం, మీరు ఏదైనా ఫౌండేషన్‌లో డబ్బులు పెట్టే ముందు లేదా ఏదైనా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ఆ ఫౌండేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారి వెబ్‌సైట్‌ను పరిశీలించండి, వారి గత చరిత్రను తెలుసుకోండి, వారి గురించి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోండి. రీసెంట్ గా ఫౌండేషన్ పేరుతో కుట్టు మిషన్ ను తీసుకొచ్చి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి మిషన్ ఇస్తామని వారిని నమ్మబలికించి ఆ తర్వాత వారి ద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఆ ఫౌండేషన్ వారే సంబంధిత అధికారుల సంతకాలు పెట్టి ఆర్డర్ కాపీలు కూడా ఇచ్చిన సంఘటన కూడా ఉన్నాయని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ముద్రలను తయారు చేసి ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఫౌండేషన్లను నడుపుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకొని బాధ్యులకు న్యాయం చేయాలని వాపోతున్నారు.



