పేద వృద్ధురాలు దహన సంస్కారాలకు మహిళా సంఘాల ఆర్థిక సహాయం
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 14(ప్రతినిది మాతంగి సురేష్): మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులో గల కొత్తపల్లి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు మృతి చెందినది వారు ఉండటానికి ఇల్లు కూడా లేని నిరుపేద కుటుంబం కావడంతో లక్ష్మమ్మ అంత్యక్రియలకు వార్డులోని సమభావన సంఘాల మహిళలు కొంతమంది ప్రజలు ఆర్థిక సహాయం చేసి మరణించిన వృద్ధురాలి భర్త కొత్తపల్లి ముత్తయ్యకు 8850 ఆర్థిక సహాయం చేసి తమ వంతుగా ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మెప్మా రిసోర్స్ పర్సన్ చెరుకుపల్లి అఖిల, గంధం రాణి, సూరపల్లి సత్య కుమారి, ఇంకా మహిళా సంఘాల నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గంధం యాదగిరి, కాంపాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



