స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్వతంత్ర సమరయోధులను స్మరించుకున్న బిజెపి నాయకులు
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 14 (ప్రతినిధి మాతంగి సురేష్): 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నారాపూరాజు రామచంద్ర రావు పిలుపుమేరకు భారత స్వతంత్ర సమరయోధులను స్మరించుకొంటూ వారిని గుర్తుచేసుకొంటూ గురువారం నాడు మన కోదాడ పట్టణం లొ కోదాడ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ నాయకత్వన మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు మొట్టమొదటి కోదాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గునుగుంట్ల చిన్న అప్పయ్య విగ్రహంను నీటితో శుద్ధి చేసి పూలమాల వేయడంజరిగింది.కోదాడ బస్టాండ్ ముందు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు మొట్టమొదటి కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు అక్కిరాజు వాసుదేవ రావుని స్మరించుకుంటూ అతని విగ్రహం నీటితో శుభ్రం చేసి పూలమాలను వేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలొ పాల్గొన్న కోదాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు గోదేశీ లక్ష్మణ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు వనం నాగేశ్వరరావు, పైడిమర్రి సతీష్, జిల్లా బీజేపీ నాయకులు ఓరుగంటి పురుషోత్తం , ఇరుకుల్లా చెన్నకేశవరావు ,అనంతగిరి మండల అధ్యక్షులు చింతకుంట్ల సతీష్ ,కోదాడ రూరల్ మాజి మండల అధ్యక్షులు దేవరశెట్టి సత్యనారాయణ, అంబటి సుధాకర్ రెడ్డి , గుంటుకుంట్ల శ్రీనివాస్ , జెల్లా జనర్దన్, ఈశ్వర్ రావు, నాగేంద్ర చారి, మునగాల శ్రీనివాస్, భాగ్యరాజ్, హనుమంతరావు, కొండ్రు రవి, పిడతల శంకర్, వెంకటేశ్వర్లు, బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు



