కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రథమ సమావేశం
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 15 (ప్రతినిధి మాతంగి సురేష్): శుక్రవారం నాడు కోదాడ లోని స్థానిక యంయస్ జూనియర్ కళాశాల లో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అల్లం ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రథమ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ కమిటీ వారిని గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ను కమిటీ వారి సహకారంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో క్రీడాకారులను తయారు చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహారావు, కోశాధికారి సైదులు,పెద్దలు వేనేపల్లి శ్రీనివాస రావు,పందిరి నాగిరెడ్డి, కమిటీ బాధ్యులు కోటయ్య,శెట్టి రామచంద్రయ్య, శ్రీనివాస రెడ్డి, రాoకోటి,రమేష్, యంయస్ విద్యా సంస్థల సీఈవో యస్ యస్ రావు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.



