దేశాభివృద్ధి దేశ క్షేమము కొరకు క్రైస్తవుల సమాధుల స్థలము కొరకు ప్రత్యేక మహా స్తుతియాగం
:కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు పాస్టర్ యేసయ్య.
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 15 (ప్రతినిది మాతంగి సురేష్): 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా స్తుతియాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య మాట్లాడుతూ మన దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేశము స్వస్థత కలిగి వ్యాదులు విస్తరించకుండా, దేశంలో ఉగ్ర కుట్రలు, కరువు కాటకాలు లేకుండా, సమస్త ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, దేశాన్ని పాలించే నాయకులు, అధికారులు, దేశానికి దేశ అభివృద్ధికి వెన్నుముకైన రైతులు, పారిశ్రామికవేత్తలు, సైంటిస్టులు, వైద్యులు, మొదలగు రాష్ట్ర దేశ ప్రభుత్వ యంత్రాంగము కొరకు, క్రైస్తవ సంఘాలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ దేవదేవునికి స్తుతియాగము చేయాలని, అలాగే ప్రత్యేకంగా క్రైస్తవుల కొరకు సమాధుల స్థలం కొరకు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని ఆయన తెలిపారు. 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ క్షేమం కోసం ప్రార్థించే ప్రార్థన యోధులు కోదాడ బాప్టిస్ట్ చర్చి ఆవరణములో ప్రత్యేక ప్రార్థనలు (యాగం) చేయుటకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఇట్టి కార్యక్రమానికి క్రైస్తవ పెద్దలు, నాయకులు, విశ్వాసులు, అనేకమంది క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు.



