స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మేము సైతం: నాటు కూలీలు
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 15: 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మేము సైతం అంటూ నాటు కూలీలు వినూత్నంగా పొలంలో జాతీయ జెండాను ఎగరవేసిన సంఘటన మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాల లకే పరిమితం కాకుండా నాటు కూలీలం మేము కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగస్వాములు కావాలని వారు నాటు వేస్తున్న పొలంలోనే జాతీయ జెండాను ఎగరవేసి జాతిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి శైలజ, అనసూర్య, కుమారి, మాల, సుజాత, సులోచన, సుజాత, హైమవతి, సునీత, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



