తల్లి త్యాగం శ్రమ ప్రోత్సాహంతో పిహెచ్ డి పూర్తి
కోదాడ ప్రాంత వాసికి పిహెచ్ డి డాక్టరేట్ ప్రధానం
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు19(ప్రతినిది మాతంగి సురేష్): కోదాడ పట్టణానికి చెందిన మాడభూషణం రాజ్యలక్ష్మి (కరుణ టీచర్) ప్రైవేట్ పాఠశాలలో చిన్న ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ భర్త తన పిల్లల చిన్నతనంలోనే దూరమయ్యారు, తన పెద్ద కుమారుడితో పాటు రెండో కుమారుడు గోపికృష్ణను ఉన్నత విద్యను నేర్పించి తన త్యాగంతో, ప్రోత్సాహంతో కుమారుడిని ఉన్నత స్థాయి విద్య పిహెచ్ డి వరకు పూర్తి చేయించిన తల్లి త్యాగం మరువలేనిది, వివరాల్లోకి వెళితే కోదాడ ప్రాంతానికి చెందిన మాడభూషణం గోపికృష్ణ భౌతిక శాస్త్రంలో పిహెచ్ డి పూర్తి చేశారు కోదాడ పట్టణంలో డిగ్రీ వరకు పూర్తి చేసి హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం శ్రీనిధి ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2010 నుండి సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ కొనసాగుతున్నారు పీహెచ్డీ పూర్తి చేయటం పట్ల తనకు విద్య నేర్పిన గురువులకు అధ్యాపకులు సహచరులకు బంధుమిత్రులకు ముఖ్యంగా తన భార్య వైష్ణవి,పిల్లలు శ్రీభార్గవి, కొడుకు శ్రీహన్, సోదరుడు వెంకటేష్ అతని కుటుంబ సభ్యులు మరియు తోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యేకంగా ప్రగతి విద్యా నిలయం వ్యవస్థాపకులు కొండపల్లి మురళీధర్ రావు వారి కుటుంబం మరియు స్నేహితులను ఎంతో రుణపడి ఉన్నానని గుర్తు చేశారు.



