ఫారెస్ట్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న పై ఏసీబీ కేసు నమోదు
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 20(ప్రతినిది మాతంగి సురేష్): ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 20000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంఘటన కోదాడ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా ఏసీబీ రేంజ్ ఆఫీసర్ జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం వుడ్ వ్యాపారి హరినాయకు చెట్టు కొనుగోలు చేసి ఆ చెట్లకు ప్రభుత్వానికి తీయాల్సిన చలానా తీయకుండా నాకు 50,000 లు ఇస్తే నేను చెట్లు కట్ చేసుకోవడానికి పర్మిషన్ చేస్తానని తెలపగా హరినాయకు ఏసీబీ వారికి సమాచారం అందియగా ఈరోజు హరినాయకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్నకు బైపాస్ లో 20000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ వారు పట్టుబడి చేసి ఫారెస్ట్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.



