మిత్రుని సేవకి సపోర్ట్ గా ఖండాంతరాలు దాటి వచ్చిన దాతృత్వం డా చప్పిడి సుధాకర్
:సామాజిక మాధ్యమాల్లో మిత్రుడి సేవలు చూసి కాలిఫోర్నియా నుండి కోదాడ వచ్చి తన మిత్రుడిని కలిసిన డా, సుధాకర్.
:పశు ఔషధ బ్యాంక్ కి సైతం తాను కూడా కొంత సాయం అంటూ పశుఆరోగ్యానికి విరాళం అందజేత.
Mbmtelugunews//కోదాడ ఆగస్టు 21(ప్రతినిది మాతంగి సురేష్): అచ్చం సినిమా కథలా ఉన్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే
డా చప్పిడి సుధాకర్ ముప్పై సంవత్సరాల క్రితం స్థానిక ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పై పెంటయ్య తో కలిసి హైదరాబాద్ పశువైద్య కళాశాలలో పశువైద్య విద్యని చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక పై చదువులకు అమెరికా వెళ్లి అక్కడే పెళ్లి చేసుకొని స్థిరపడిపోయారు. వారి మిత్రుడు డా పి పెంటయ్య ఇక్కడే ఉద్యోగంలో చేరి ప్రస్తుతం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

కోదాడ లో విధులలో చేరి నప్పటి నుండి పశుఆరోగ్య సేవలతో పాటు పశుపోషకుల సంక్షేమం కోసం వినూత్నంగా ఆలోచిస్తూ పశుపోషణ భారం కాకుండా లాభాలభటలో నడవడానికి వైద్య,మేపు ఖర్చులు తగ్గించడానికి దేశం లో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా దాతల సహకారంతో పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి పశు వైద్యంలో ఉచితంగా,సబ్సిడీ పై ఔషధాలు అందిస్తున్నారు. మాధ్యమాల ద్వారా తన మిత్రుడి సేవలను గుర్తించి అబ్బురపడిన డా, సుధాకర్ ఎవరికీ చెప్పకుండా వచ్చి తన మిత్రుడిని కలిసి అభినందించాలని కొంతకాలంగా ప్లాన్ చేస్తూ ఈమధ్యనే అసిస్టెంట్ డైరెక్టర్ కి ఫోన్ చేసి తన మిత్రుడు ఒకరు వచ్చి నిన్ను కలుస్తాడు నీ అడ్రస్ లొకేషన్ షేర్ చేయమని అడిగి తీసుకున్నారు. కట్ చేస్తే సర్ప్రైజింగ్ గా ఈరోజు చెప్పకుండా తానే స్వయంగా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు వచ్చి ఆనందంలో మిత్రుడిని ముంచెత్తారు. తన క్లాస్ మేట్ పశువైద్యంలో ఎంతో వినూత్నంగా వైద్యసేవలు అందిస్తున్న విధానం పశుపోషకులకోసం పడుతున్న తపన ఎంతగానో ఆకట్టుకున్న నేపథ్యంలో ఎలాగైనా తనని కలిసి అభినందించాలని హైదరాబాద్ వచ్చిన వెంటనే ఈరోజు కోదాడ రావడం జరిగిందని మిత్రుని కలిసిన ఆనందం లో చెప్పారు. మూగ జీవాల సేవలో తానుసైతం ఒక చేయి వేస్తానంటూ తన తండ్రిగారైన కీ. శే, గాబ్రియల్ పేరు మీదుగా రూ. 20000/- విరాళం అందజేశారు. ముప్పది సంవత్సరాల ఎడబాటు తర్వాత అకస్మాత్తుగా ప్రత్యక్షమైన మిత్రుడు డా, సుధాకర్ ని చూసి సంభ్రమాత్సర్యాలకు గురైన డా, పి పెంటయ్య, తాను పశుపోషకుల చేయూతకై చేస్తున్న ప్రయత్నం లో తాను పాలుపంచుకుంటూ అందించిన విరాళాన్ని రివాల్వింగ్ ఫండ్ గా వాడుతూ కలకాలం పశుపోషకులకు గొర్రెలు, మేకల పెంపకం దారులకు డా, సుధాకర్ నాన్న శ్రీ గాబ్రియల్ పేరు మీదుగా అందరికీ అన్నివేళలా ఉపయోగపడే లివర్ టానిక్ ని నిరంతరం పశు ఔషద బ్యాంక్ ద్వారా సరఫరా చేస్తానని తెలిపారు. అనంతరం తీయటి మనసున్న మిత్రుడు డా, సుధాకర్ గుర్తుగా పండ్లలో శ్రేష్ఠమైన హిమాయత్ పసంద్ మామిడి మొక్కని పశువైద్యశాల ఆవరణలో నాటించారు. అలాగే వీరిద్దరి క్లాస్ మెట్ డా, బి వెంకన్న అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యాపేట వారు కూడా మిత్రులతో కలసి ఆనందం పంచుకున్నారు.



