బిజెపి మోడీ నిర్లక్ష్యం వల్ల యూరియ కొరత:ఏఎంసి చెర్మన్ తిరుపతమ్మ.
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 28(ప్రతినిది మాతంగి సురేష్): కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం అసమర్థత నిర్లక్ష్యం వల్లనే దేశంలో మన రాష్ట్రంలో రైతులకు యూరియ కొరత ఏర్పడిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సాధారణ 5 వ కమిటీ సమావేశం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీర్చడంలో విఫలమయ్యారని కేవలం బిజెపి ప్రభుత్వం అధికార కోసమే పరితపిస్తుందని రైతులను బిజెపి మోసం చేస్తుందన్నారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్లో ఉన్న సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ శనివారం ఆదివారం పశువుల సంత ఉన్నందున ఖమ్మం, సూర్యాపేట, నందిగామ, ఆంధ్ర నెల్లూరు, గుంటూరు నుండి కొనుగోలు అమ్మకారులు చేసుకునే రైతులకు వ్యాపారస్తులకు చెక్ పోస్ట్ ల వద్ద కొంతమంది బజరంగ్దళ్ పేరు మీద పోలీసులకు సమాచారం ఇచ్చి వాహనాలు అపుతున్నారని లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పశువులను గోశాలలకు తరలించటం దానిద్వారా వ్యాపారాలు సజావుగా సంత జరగడం లేదన్నారు. కోదాడ సంత మినహా మిర్యాలగూడెం, నందిగామ, సూర్యాపేట, ఖమ్మం అన్ని సంతలు సజావుగా జరుగుతున్నాయని కేవలం కోదాడ సంత నుండి వెళ్లే వాహనాలు మాత్రమే ఆపి రైతులను వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంటి విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి మార్గం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో
వైస్ చైర్మన్ బషీర్, గ్రేడ్ వన్ సెలక్షన్ సెక్రటరీ రాహుల్, మెంబెర్స్ తమానబోయిన వీరబాబు, మల్లు వెంకటరెడ్డి, కోటయ్య, చింతకుట్ల సూర్యం, శ్రీను, మన్నెమ్మ, శ్రీనివాస్, నర్సిరెడ్డి సిబ్బంది తదితరులు ఉన్నారు.



