అర్హతలు లేని హాస్పిటల్ పై చర్యలు తప్పవు: డిఎం అండ్ హెచ్ఓ పి చంద్రశేఖర్
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 29 (ప్రతినిది మాతంగి సురేష్): అర్హతలు లేకుండా నకిలీ వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ హెచ్చరించారు. గతంలో వైద్యాధికారులు చేసిన తనిఖీలలో భాగంగా అర్హత లేకుండా కోదాడ పట్టణంలో లక్ష్మీ నవీన్ హాస్పిటల్ లో ఎండి పిజీషియన్ పి నవీన్ కుమార్ నకిలీ వైద్యం చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, పలుమార్లు నోటీసు అందజేసిన ఎలాంటి స్పందన లేకపోవడంతో నేటికీ అలాగే నకిలీ వైద్యం చేస్తున్నట్లు గుర్తించి శుక్రవారం సూర్యాపేట జిల్లా వైద్యాధికారి నవీన్ లక్ష్మీ నవీన్ హాస్పిటల్ ను సీజ్ చేసి మూసి వేయడం జరిగిందని, అలాగే హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ను తక్షణం రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి ప్రకటించారు.



