తెలుగు భాష, క్రీడా దినోత్సవ వేడుకలు
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 29 (ప్రతినిది మాతంగి సురేష్): ఆగస్టు 29 ని పురస్కరించుకొని స్థానిక తేజా టాలెంట్ స్కూల్లో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని,హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతి వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. తెలుగు ఉపాధ్యాయులు తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియపరిచారు. పిల్లలు తెలుగు గొప్పదనాన్ని తెలియపరుస్తూ, పాటలు పాడి అలరించారు. అదేవిధంగా కొంతమంది ఉపాధ్యాయులు క్రీడల యొక్క గొప్పదనాన్ని, ఆరోగ్యానికి క్రీడలు ఎంత అవసరమో వారి వారి అభిప్రాయాలను పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య, సెక్రటరీ సంతోష్ కుమార్, ప్రిన్సిపాల్ సోమనాయక్, ఇన్చార్జులు రామ్మూర్తి, నవ్య, రేణుక, పిఈటి రాంబాబు, గణేష్ పాల్గొన్నారు.



