సెప్టెంబర్ 1న జరిగే పాత పెన్షన్ సాధనా పోరాట సభను విజయవంతం చేయాలి: విక్రమ్
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 29(ప్రతినిధి మాతంగి సురేష్):సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పాత పెన్షన్ సాధన పోరాట సభ హైదరాబాదులోని ఆర్టీసీ కళాభవన్ విఎస్టీ దగ్గర టీజీఈజెఎసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని టీఎన్జీవో కోదాడ యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విక్రమ్ తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి జిల్లాలోని టీజీఇజెఎసి లోని భాగస్వామ్య సంఘాలైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల బాధ్యులందరూ హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



