గుండెలో ఉప్పొంగి పాలపొంగులధారలతోఅభిమానం చాటిన మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ నజీర్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 02(ప్రతినిధి మాతంగి సురేష్) పట్టణంలో దివంగత ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ నజీర్ రాజశేఖర్ రెడ్డి పై అభిమానాన్ని వ్యక్త పరుచుకునేందుకు క్రేన్ సహాయంతో పది లీటర్ల పాలతో పాలభిషేకంచేశారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పేదల పక్ష దేవుడని అన్నారు. పది సంవత్సరాల సుదీర్ఘ విరామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఊరు ఊరు గడప గడప పాద యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కి తెచ్చిన మహానేత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి పేదల పక్షాన దేవుడైనడని నేడు ధనిక పేద అనే వివక్షత లేకుండా విద్యార్థి విద్యార్థినులకు ఉన్నత విద్యను పొందేలా విద్య సంస్థలు పథకాలు చేపట్టారన్నారు ఆరోగ్య శ్రీ పథకం 108 ఆంబులెన్స్ ఉపాధి అవకాశాలు,ఎన్నో కల్పించి ప్రజల హృదయాలలో చిరస్మరనీయులుగా బ్రతికి ఉన్నారని అన్నారు ఆయన పై అభిమానమే నేడు పాలభీషేకం చేయ్యడం జరిగిందన్నారు.



