స్వర్ణ భారతి ట్రస్టు సేవలు అభినందనీయం…..
:కోదాడలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి………
కోదాడ, సెప్టెంబర్ 05(మనం న్యూస్): గణేష్ శోభాయాత్రకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు అధికారులతో కలిసి గణేష్ నిమజ్జన భక్తులకు ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ పంపిణీ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ట్రస్టు సభ్యులను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ, సెక్రటరీ చారుగండ్ల ప్రవీణ రాజశేఖర్, ఓరుగంటి కిట్టు, చెన్నకేశవరావు, పైడిమర్రి సత్తిబాబు, సుంకర లింగారెడ్డి, బండారు శ్రీనివాసరావు, ఓరుగంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…….



